కోయిల్‌కొండలో రెచ్చిన జనం: గాయపడిన సీఐ (వీడియో)

By narsimha lodeFirst Published Feb 4, 2019, 6:37 PM IST
Highlights

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపకూడదని చేపట్టిన ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారింది

మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపకూడదని చేపట్టిన ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల రాళ్ల దాడిలో సీఐ పాండురంగారెడ్డి తలకు గాయాలయ్యాయి.

కోయిల్‌కొండ మండలాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే కొనసాగించాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మహబూబ్‌నగర్- కోయిల్‌కొండ మార్గంలోని దమ్మాయిపల్లి గేటు వద్ద వంటా వార్పు నిర్వహించారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది.

ఆందోళనకారులు  పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సీఐ పాండురంగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.  అదనపు బలగాలను  తరలించారు.  

వీడియో

"

click me!