హరీష్‌ కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నం చేశారు: జగ్గారెడ్డి సంచలనం

By narsimha lodeFirst Published Feb 4, 2019, 5:19 PM IST
Highlights

కేసీఆర్ వల్లే తాను  తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పారు. హరీష్ రావు కంటే  కేటీఆర్ చాలా ఫెయిర్ క్యాండిడేట్ అన్నారు.2008లోనే హరీష్ రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.
 


హైదరాబాద్:  కేసీఆర్ వల్లే తాను  తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పారు. హరీష్ రావు కంటే  కేటీఆర్ చాలా ఫెయిర్ క్యాండిడేట్ అన్నారు.2008లోనే హరీష్ రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. 2008లో  కేవీపీ ద్వారా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీలో తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలో కేసీఆర్ పిలిచి తనకు టిక్కెట్టు ఇచ్చారని జగ్గారెడ్డి చెప్పారు.

కేసీఆర్ వల్లే తాను 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టు ఆయన చెప్పారు. తనకు కేసీఆర్ కుటుంబంతో వైరం లేదని స్పష్టం చేశారు. తనకు హరీష్‌రావుతోనే విబేధాలు ఉన్నాయన్నారు.  హరీష్ రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తాడని జగ్గారెడ్డి ఆరోపించారు.

హరీష్ రావు కంటే కేటీఆర్ చాలా ఫెయిర్‌గా ఉంటాడని చెప్పారు.  మెడికల్ కాలేజీ కోసం తాను కేసీఆర్, కేటీఆర్‌లను కలుస్తానని చెప్పారు. తాను జైలులో ఉన్నపుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న హేమా హేమీ నాయకులు చూడడానికి కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తనకు అండగా నిలిచారని తెలిపారు. వీహెచ్ తప్ప మరెవరు తనను వచ్చి పరామర్శించలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చాలా హర్ట్‌ అయ్యానన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో లాబీయిస్టులదే నడుస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు పదవులు వచ్చిన వారికి అలాగే వచ్చాయన్నారు. ఇప్పటికైనా లాబీయింగ్‌లకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ వల్ల నాకు మంచి జరిగింది: జగ్గారెడ్డి
 

click me!