హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం...మహిళా పోలీస్ మృతి

Published : Feb 04, 2019, 04:00 PM ISTUpdated : Feb 04, 2019, 04:01 PM IST
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం...మహిళా పోలీస్ మృతి

సారాంశం

ఇవాళ ఉదయం హైదరాబాద్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ మహిళా పోలీస్ ప్రాణాలను బలితీసుకుంది. రద్దీగా వున్న రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని మహిళా పోలీస్ సంఘటన స్థలంలోనే మృతిచెందారు.   

పాతబస్తీలోని చార్మినార్ పోలీస్ స్టేషన్లో సుజాత అనే మహిళ హోంగార్డుగా పనిచేస్తోంది. ఆమె తన కుటుంబంతో కలిసి మైలార్‌దేవ్‌పల్లిలోని వాంబే కాలనీలో నివాసం ఉంటోంది. అయితే సుజాత ఇవాళ సుజాత మైలార్‌దేవ్‌పల్లిలో రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వచ్చిన ఓ డీసిఎం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా  ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు