బంగారి తెలగాణలోనూ ఉక్కుబూట్ల చప్పుళ్లేనా? (కవిత)

First Published Aug 12, 2017, 3:02 PM IST
Highlights
  • కోదండరాం అరెస్టుపై రగిలిన కవి గుండె
  • బంగారు తెలంగాణలో ఉక్కుబూట్ల కవాతుపై ఆగ్రహం
  • వేల పుస్తకాలు చదివినా నిజాం లక్షణాలు ఎటుపోతాయని ప్రశ్న
  • ప్రశ్నించే గొంతులను బంధూకులతో మూయిస్తున్నారని ఆవేదన

అన్నలైతే లేరు...

అజ్ఞాత జీవితమే లేదు..

అయినా బంగారు తెలంగాణాలో తుపాకీ రాజ్యమేలుతోంది.

 

తీవ్రవాదం కాదు..

ఉన్మాదం అంతకన్నా లేదు ..

అయినా ఉక్కుబూట్ల చప్పుళ్లు తెలంగాణా ఉద్యమకారులను నలిపేస్తున్నాయి.

 

ప్రశ్నించడమే నేరం..

నిలదీయడమే ఉగ్రవాదం..

అందుకే బందూకులతో నోళ్లు మూయిస్తున్నారు.

 

ఇసుక మాపియా ప్రాణాలు తీస్తున్నా..

మిషన్ పేరుతో వేల కోట్లు దోస్తున్నా..

రైతులను జీవచ్ఛవాలను చేసి మీరు పేలాలు ఏరుకుంటున్నా..

ప్రశ్నించిన ప్రతోడూ మీ దృష్టిలో బిన్ లాడెనే.

 

వేల పుస్తకాలు చదివినా..

లక్షల సుద్దులు ఇన్నా..

నిజాం లక్షణాలు పోతాయా..

పాలన జనరంజకం అవుతుందా..

బందూక్ తెలంగాణా కాదా దానికి నిదర్శనం.

 

అయ్యా కెసిఆర్..

ఎన్ని బలగాలు దించుతావో దించు,

మిలిట్రోడు నీ రజాకార్లూ,

తాబేదారులు నీ బానిసలూ,

నీ గడిలో కొలువైన మేథావులు,

 ఎంత మందిని ఉసిగోల్పినా మొరిగినా,

కోదండరాం, ఆయన ప్రజా సైన్యం చెబుతుంది నీకు గుణపాఠం.

తెలంగాణా ఉద్యమంలో అవుతుంది ఓ నూతన అధ్యాయం.

 

-  కోదండరాం సార్ అరెస్టును నిరసిస్తూ రాసిన కవిత (సోషల్ మీడియా సోర్స్)

click me!