తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు: ఓయూలో ఆందోళన

By narsimha lode  |  First Published Oct 26, 2022, 2:08 PM IST

కానిస్టేబుల్ రాతపరీక్ష  ఫలితాల్లో అవకతవకలు  జరిగాయని  అభ్యర్ధులు   ఆందోళన చేస్తున్నారు. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన  22  తప్పులకు  మార్కులు కలపాలని  కోరుతున్నారు.


హైదరాబాద్: కానిస్టేబుల్ రాత  పరీక్ష ఫలితాల్లో  అవకతవకలు జరిగాయని పరీక్ష  రాసిన  అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు.బుధవారంనాడు ఓయూలో  ఈ  పరీక్ష రాసిన అభ్యర్ధులు  ఆందోళన చేశారు.ప్రశ్నాపత్రంలో 22 తప్పులకు మార్కులు  కలపాలని  డిమాండ్  చేశారు. లేకపోతే  డీజీపీ  కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ ఏడాది ఆగస్టు 28న కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహించారు.ఈ నెల  21న ఈ రాత పరీక్ష ఫలితాలను వెల్లడించారు. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్ధులకు పిజికల్ టెస్టు నిర్వహించున్నారు.సివిల్ కానిస్టేబుల్  పరీక్షల్లో 31..40 శాతం,రవాణా శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు  44.34  శాతం, ఎక్సైజ్  శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు 43. 65 శాతం అభ్యర్ధులు ఉత్తీర్ణత  సాధించారు. 

సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 15,664 పోస్టులు , ఎక్సైజ్ శాఖలో 614,  రవాణా శాఖలో 63 కానిస్టేబుల్  పోస్టులకు  పరీక్షలు  నిర్వహించారు. రాష్ట్రంలోని 1601  పరీక్షా  కేంద్రాల్లో 6,03,955మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షకు మాత్రం 6,61,196మంది ధరఖాస్తు చేసుకున్నారు.ఎస్ఐ,కానిస్టేబుల్  రాత పరీక్షల్లో కటాఫ్ మార్కులను  ప్రభుత్వం  సవరించింది. ఎస్సీ,ఎస్టీలకు 40 మార్కులను కటాఫ్ గా  నిర్ణయించింది. బీసీలకు 50 ,60 మార్కులను ఓసీలకు కటాఫ్ గా  నిర్ణయించింది. అయితే  కానిస్టేబుల్ రాత పరీక్ష  సందర్భంగా ఇచ్చిన ప్రశ్నాపత్రంలో 22  తప్పులున్నాయని   పరీక్ష రాసిన రోజునే ప్రచారం  సాగింది. అయితే  ఈ ప్రచారంపై పోలీస్ రిక్రూట్ మెంట్  బోర్డు స్పందించింది. ప్రశ్నపత్రంలో తప్పులపై నిపుణుల కమిటీతో  విచారణ  నిర్వహించి  తదుపరి  కార్యాచరణను  ప్రకటిస్తామని  పోలీస్ రిక్రూట్  మెంట్  బోర్డు ప్రకటించింది.

Latest Videos

click me!