దేశంలోని పోరాట యోధుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.
హైదరాబాద్: దేశంలోని పోరాట యోధుల చరిత్రను తమ సర్కార్ భవిష్యత్తు తరాలకు అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
హైద్రాబాద్ చిక్కడపల్లిలోని సర్ధార్ సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ ను ను బుధవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సర్ధార్ సర్వాయి పాపన్న లాంటి ఎందరో పోరాట యోధలు చరిత్ర మరుగున పడిందన్నారు. అలాంటి వారి చరిత్రను నవతరానికి అందించేందుకు పూనుకున్నట్టుగా ఆయన వివరించారు. ఇలాంటి యోధుల స్పూర్తి ఎప్పటికీ ఆదర్శమేనన్నారు.ఈ స్పూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడ ఆనాటి హైద్రాబాద్ సంస్థానంలో స్వాతంత్ర్యం రాలేదన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్ధార్ పటేల్ నేతృత్వంలో 1948లో హైద్రాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం లభించిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన సమయంలో ఇలాంటి పోరాట యోధులను గుర్తు చేసుకుంటున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తు తరాలకు సర్ధార్ సర్వాయి పాపన్న అందించాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రభుత్వం పాపన్న సేవలను ప్రజలకు గుర్తుండేటా కార్యక్రమలను రూపొందించనున్నట్టుగా చెప్పారు. సర్ధార్ సర్వాయి పాపన్న పేరుతో పోస్టల్ కవర్ ను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం అడగగానే అనుమతిని ఇచ్చిందన్నారు.గోల్కొండమ కోటను లైట్లతో ఆలంకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసిందన్నారు.
భువనగిరి కోటను కూడ అభివృద్ది చేస్తామని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను స్మరించుుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి చెప్పారు. ఈ విషయమై రెండుమ మూడు రోజుల్లో కేంద్రం నుండి ఆదేశాలు వస్తాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులన్నారు. సమయం వచ్చినప్పుడల్లా తమ ఉద్యమం ద్వారా పాలకుల మెడలు వంచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మత్యాగం చేసుకున్న అమరుల స్పూర్తిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అంతకు ముందు ఇదే కార్యక్రమంలో పాల్గొన్నబీజేపీ ఎంపీ డాక్లర్ లక్ష్మణ్ ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణను విముక్తి చేసేందుకు సర్వార్ సర్వాయి పాపన్న స్పూర్తితో పోరాటం చేయాలని ఆయన కోరారు.సర్దార్ సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ ను ఆవిష్కరించుకోవడం చరిత్రలో లిఖించుకోదగిన రోజుగా ఆయన పేర్కొన్నారు. గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. గీత వృత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.తాటి వనాలు పెంచుకొనేందుకు గాను కల్లు గీత సోసైటీలకు ఐదు ఎకరాలు ఇస్తామన్న హామీని విస్మరించాయన్నారు. గీత కార్పోరేషన్ ఫెడరేషన్ కు ఛైర్మెన్ లేడన్నారు. అన్ని కార్పోరేషన్లలో కూడ నిధులు లేవని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. గీత వృత్తి పై ఆధారపడిన వారిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు కోట్ల ఈత మొక్కలు నాటుతామని చెప్పిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కేంద్రంలో మోడీ కేబినెట్లో 27 మంది ఓబీసీలకు యూపీలో 22 మంది ఓబీసీలకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.