సోదరుడి ఇంట్లోనే గుట్టుగా వ్యభిచార గృహం.. ఓ మహిళ ఘాతుకం...

Published : Dec 20, 2021, 12:05 PM ISTUpdated : Dec 20, 2021, 12:06 PM IST
సోదరుడి ఇంట్లోనే గుట్టుగా వ్యభిచార గృహం.. ఓ మహిళ ఘాతుకం...

సారాంశం

ఎల్ బీనగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇంటి మీద దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావుతో పాటు వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటలక్ష్మి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. కాగా, గతంలోనూ వెంకటలక్ష్మిని పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

హైదరాబాద్ : LB nagar పోలీసులు ఓ Brothel house గుట్టు రట్టు చేశారు. గృహం నిర్వాహకురాలితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి సెల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం రిమాండ్ కు తరలించారు. ఎల్ బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మ జిల్లా లక్ష్మీ పురం కాలనీకి చెందిన ఎస్. వెంకటలక్ష్మి (68) బైరామల్ గూడ రెడ్డి కాలనీలోని తన సోదరుడి ఇంట్లో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది.

సమాచారం అందుకున్న ఎల్ బీనగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇంటి మీద దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావుతో పాటు వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటలక్ష్మి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. కాగా, గతంలోనూ వెంకటలక్ష్మిని పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వెంకటలక్ష్మి అదే వృత్తిని కొనసాగిస్తూ పట్టుబడింది. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివారులోని కీసరలో గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు నవంబర్ లో అరెస్ట్ చేసారు. ఆన్లైన్ ద్వారా అమ్మాయిల ఫోటోలను విటులకు పంపి డబ్బులను కూడా అదే పద్దతితో వసూలు చేసి అమ్మాయిలను వారివద్దకు పంపిస్తున్నారు. ఇలా ఎలాంటి వ్యభిచార గృహాన్ని నిర్వహించకుండానే హెటెక్ పద్దతిలో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేసారు. 

వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కుమారస్వామి(49) ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లోని ఈసిఐఎల్ లో నివాసముంటున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలని భావించిన అతడు అందుకోసం గలీజ్ దందాను ఎంచుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండా హైటెక్ పద్దతిలో వ్యభిచారాన్ని నిర్వహించసాగాడు. 

టీకొట్టు నడిపించుకునే అరుణకుమారి అనే మహిళతో కుమారస్వామికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి గతంలో మేడిపల్లి పరిధిలో prostitution business నిర్వహిస్తూ పట్టుబబడటంతో కేసు నమోదయ్యింది.. దీంతో పోలీసుల నిఘా వుండటంతో తమ దందాను వీరు కీసరకు మార్చారు.  

దొంగ భార్య అరెస్ట్.. మా పాపకు ఫిట్స్.. ఆమెకేమైనా అయితే ఎవరు చూసుకోవాలి’ అంటూ పోలీసులతో భర్త వాగ్వాదం..

మహిళలు, యువతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. వీరి ఫోటోలను వాట్సాప్ తో వాటు వివిధ మాధ్యమాల ద్వారా విటులకు పంపించి ఆకర్షించేవారు. ఎవరయినా ఆకర్షితులైతే వారి వద్ద ఆన్లైన్ ద్వారానే డబ్బులు తీసుకుని కోరిన చోటకు అమ్మాయిలను పంపించేవారు. ఇలా ఎలాంటి వ్యభిచార గృహం లేకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళను కలకత్తానుండి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

అయితే వీరి వ్యభిచార దందాపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో నిర్వహకులు కుమారస్వామి, అరుణకుమారిపై నిఘాపెట్టారు. దీంతో వారు బంగ్లాదేశీ మహిళను బోడుప్పల్ కు చెందిన ఓ విటుడి వద్దకు పంపించడానికి బేరం కుదిరినట్లు తెలిసింది. దీంతో బంగ్లాదేశీ మహిళతో పాటు ఇద్దరు నిర్వహకులను అరెస్ట్ చేసారు. వారివద్ద నుండి రెండు సెల్ ఫోన్లు, ఓ కారు, నాలుగువేల రూపాయలను స్వాధీనం  చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ