షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత.. అక్కడే నిందితులకు వైద్య పరీక్షలు

By Nagaraju penumalaFirst Published Nov 30, 2019, 1:34 PM IST
Highlights

ఇకపోతే స్టేషన్ చుట్టూ ఆందోళన కారులు ఉండటంతో పోలీసులు నిందితులను ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్, సురేందర్ లు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. 

హైదరాబాద్: వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసు నేపథ్యంలో షాద్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్త నెలకొంది. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి లేదా తమకు అప్పగించాలంటూ ఆందోళన కారులు స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. 

ఇకపోతే వైద్యురాలు ప్రియాంకరెడ్డిపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు షాద్ నగర్ పీఎస్ లో ఉన్న సంగతి తెలిసిందే. షాద్ నగర్ పీఎస్ లో నిందితులు ఉన్నారని తెలియడంతో స్థానికులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. 

పోలీసులు ఎన్ కౌంటర్ చేయని పక్షంలో వదిలేస్తే తామే చూసుకుంటామని హెచ్చరించారు. తామే చంపేసి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆందోళన కారులు. 

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున ఆందోళన కారులు చేరుకున్నారు. స్టేషన్ ను చుట్టుముట్టారు. ఒకానొక దశలో పోలీస్ స్టేషన్లో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. దాంతో వారిని పోలీసులు అడ్డుకోగా ఇరువురి మధ్య స్వల్పతోపుటలాట చోటు చేసుకుంది. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్టేషన్ వద్దకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వచ్చారు. ఆందోళ కారులతో చర్చించే ప్రయత్నం చేశారు. నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. అనంతరం పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. 

ఇకపోతే స్టేషన్ చుట్టూ ఆందోళన కారులు ఉండటంతో పోలీసులు నిందితులను ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్, సురేందర్ లు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. 

మరోవైపు ప్రియాంక హత్య కేసులో నిందితులను షాద్ నగర్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే షాద్ నగర్ కోర్టు మెజిస్ట్రేట్ లు అందుబాటులో లేకపోవడంతో మండల ఎగ్జిక్యూటివ్  మెజిస్ట్రేట్ వద్ద విచారించే అవకాశం ఉంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రియాంక విధి వంచితురాలైంది: దుర్యోదన, దుశ్యాసన పాటను గుర్తు చేస్తూ విజయశాంతి ఆవేదన

priyanka reddy case : షాద్ నగర్ పీఎస్ లో నిందితులు.. చంపేస్తామంటూ

click me!