మా ఇంటికి రావొద్దు: ప్రియాంక పేరెంట్స్, ఇంటికి తాళం వేసుకుని...

By telugu teamFirst Published Dec 1, 2019, 9:09 AM IST
Highlights

తమ ఇంటికి ఎవరూ రావద్దని హత్యకు గురైన ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమకు ఎవరి సానుభూతి కూడా అక్కర్లేదని అంటున్నారు. ఎవరు వచ్చినా తమకు చేసేదేమీ లేదని అంటున్నారు.

హైదరాబాద్: తమ ఇంటికి ఎవరూ రావద్దని హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు కోరారు. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు అంటున్నారు. 

రాజకీయ నాయకులు, పోలీసులు ఎవరు కూడా తమ ఇంటికి రావద్దని వారు కోరుతున్నారు. ఎవరు వచ్చినా చేసేదేమీ లేదని వారు అంటున్నారు. ఎవరి సానుభూతి కూడా తమకు అవసరం లేదని వారు చెబుతున్నారు. 

Also Read: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య: నిందితులు ముందే దొరికినా వదిలేశారు

ఇంటి గేటుకు తాళం వేసుకున్నారు. ఎవరు వచ్చినా తమ కూతురిని తీసుకుని రాలేరు కదా అంటున్నారు. మీడియా కూడా రావద్దని అంటున్నారు. ఆ రోజు ఒక్కరిని పంపించి ఉంటే పిల్ల బతికి ఉండేదని ప్రియాంక బంధువులు అంటున్నారు. 

ఆరీఫ్ చరిత్ర ఇదీ...

ప్రియాంక రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ 2010లో పదో తరగితి పాసయ్యాడు. ఆ తర్వాత 2012 నుంచి 2015 వరకు హైదరాబాదులోని కూకట్ పల్లిలో గల ఓ గ్యాస్ కంపెనీలో పనిచేశాడు. 2016లో స్వగ్రామం జక్లేరులో పెట్రోల్ బంకులో పని చేశాడు. 

అదే ఏడాది చివరలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరువాసి శ్రీనివాస రెడ్డికి చెందిన లారీలో క్లీనర్ గా చేరాడు. తక్కువ సమయంలో లారీ డ్రైవింగ్ నేరుచుకున్నాడు. లైసెన్సు లేకుండానే రెండేళ్లుగా లారీ నడుపుతున్నాడు.

Also Read: ప్రియాంక రెడ్డి కేసు: ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్, గోడ కూల్చివేత

కళ్లు తెరిచి చూసిందని...

సామూహిక అత్యాచారం  చేసిన సమయంలో ప్రియాంక రెడ్డి అపస్మారక స్థితికి చేరుకుంది. దాంతో నిందితులు పారిపోవాలని చూశారు. చీకట్లో తమను ఎవరైనా చూశారా, లేదా అనేది చుట్టూ ఒక్కసారి చూసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆ సమయంలో ప్రియాంక రెడ్డి కళ్లు తెరిచి నిందితులను విస్తుపోయి చూసిందని, దాంతో నిందితులు కంగారుపడి విషయం వెలుగు చూస్తుందని భయపడి ఆమె నోరు, ముక్కు మూసేసి హత్య చేసినట్లు చెబుతున్నారు. 

click me!