ప్రియాంక రెడ్డి కేసు: ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్, గోడ కూల్చివేత

By telugu team  |  First Published Dec 1, 2019, 6:16 AM IST

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణపై సీపీ సజ్జనార్ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు ఎస్సై రవికుమార్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.


హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. షాద్ నగర్ లో ప్రియాంక రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. 

శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ లను పోలీసు కమిషనర్ సజ్జనార్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణపై వారిని సస్పెండ్ చేశారు. హత్యకు ముందు ప్రియాంక రెడ్డి తన సోదరితో ఫోన్ లో మాట్లాడారు. తాను ఉన్న పరిస్థితిని వివరించారు.

Latest Videos

undefined

Also Read: ఆ ఫోన్ కాల్ లేకపోయుంటే: ప్రియాంక నిందితుల గుట్టు విప్పింది అదే...

ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.  అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించారని ముగ్గురిపై ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

గోడ కూల్చివేత

ప్రియాంక రెడ్డిపై దారుణం జరిగిన స్థలంలోని గోడను పోలీసులు కూల్చివేశారు. ప్రియాంక రెడ్డిని నాలుగు వైపుల ప్రహారీగోడ ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పోలీసులు ఆ గోడను కూల్చివేశారు. 

Also Read: చర్లపల్లికి ప్రియాంక నిందితులు: హై సెక్యూరిటీ బ్లాక్‌లో సెల్, ఖైదీ నెంబర్లు ఇవే

ప్రియాంక హత్య జరిగిన స్థలంలో స్థానికులు దీపాలు వెలిగించి ఆమె ఫొటోకు శ్రద్ధాంజలి ఘటించారు నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు పోలీసులను కోరారు.

click me!