షాద్‌నగర్ పీఎస్‌ వద్ద హైటెన్షన్: నిందితుల తరలింపు, జనంపై లాఠీఛార్జీ

By sivanagaprasad KodatiFirst Published Nov 30, 2019, 4:18 PM IST
Highlights

డాక్టర్ ప్రియాంకరెడ్డికి న్యాయం చేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

డాక్టర్ ప్రియాంకరెడ్డికి న్యాయం చేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిందితులను తమకు అప్పగిస్తే తాము చూసుకుంటామని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఉదయం నుంచి తిండి, నీరు లేకుండా స్టేషన్ వద్దే బైఠాయించారు.

తమకు సహకరిస్తే న్యాయం చేస్తామని డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ జనంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు పీఎస్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసు బలగాలపైకి చెప్పులు విసిరారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు లాఠీఛార్జీ చేసి ప్రజలను చెదరగొట్టారు.

Also Read:షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత.. అక్కడే నిందితులకు వైద్య పరీక్షలు

ఈ నేపథ్యంలో షాద్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఎస్ వద్దకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం చేరుకుంటుండటంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మార్గమధ్యంలో నిందితులపై ప్రజలు దాడి చేయకుండా వారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు పోలీస్ వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు.

షాద్ నగర్ పీఎస్ లో నిందితులు ఉన్నారని తెలియడంతో స్థానికులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. 

పోలీసులు ఎన్ కౌంటర్ చేయని పక్షంలో వదిలేస్తే తామే చూసుకుంటామని హెచ్చరించారు. తామే చంపేసి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆందోళన కారులు. 

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున ఆందోళన కారులు చేరుకున్నారు. స్టేషన్ ను చుట్టుముట్టారు. ఒకానొక దశలో పోలీస్ స్టేషన్లో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. దాంతో వారిని పోలీసులు అడ్డుకోగా ఇరువురి మధ్య స్వల్పతోపుటలాట చోటు చేసుకుంది. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్టేషన్ వద్దకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వచ్చారు. ఆందోళ కారులతో చర్చించే ప్రయత్నం చేశారు. నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేస్తామని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. అనంతరం పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. 

Also Read:ప్రియాంక విధి వంచితురాలైంది: దుర్యోదన, దుశ్యాసన పాటను గుర్తు చేస్తూ విజయశాంతి ఆవేదన

ఇకపోతే స్టేషన్ చుట్టూ ఆందోళన కారులు ఉండటంతో పోలీసులు నిందితులను ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్, సురేందర్ లు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరుపరచగా.. ఆయన వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. 

click me!