ఓటుకు నోటు కేసు: సండ్ర వెంకటవీరయ్య, ఉదయ సింహాలకు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ

Published : Nov 02, 2020, 02:36 PM ISTUpdated : Nov 02, 2020, 02:45 PM IST
ఓటుకు నోటు కేసు: సండ్ర వెంకటవీరయ్య, ఉదయ సింహాలకు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ

సారాంశం

ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయ సింహాలకు ఎదురు దెబ్బ తగిలింది. వీరిద్దరూ దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్లను ఏసీబీ కోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.  

ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయ సింహాలకు ఎదురు దెబ్బ తగిలింది. వీరిద్దరూ దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్లను ఏసీబీ కోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.

ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని ఏసీబీ కోర్టులో సండ్ర వెంకటవీరయ్య, ఉదయ సింహాలు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లను ఏసీబీ కోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.ఈ కేసు విచారణను  ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది.

also read:ఓటుకు నోటు కేసు: డిశ్చార్జీ పిటిషన్లపై నవంబర్ 2న తీర్పు

ఓటుకు నోటు కేసును  అక్టోబర్ 12వ తేదీ నుండి రోజువారీగా విచారిస్తోంది ఏసీబీ కోర్టు. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వెంటనే  పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ కేసు విచారణను రోజువారీ చేపట్టింది ఏసీబీ కోర్టు.

ఈ కేసులో తమ పేర్లను తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహాలు  ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీకి ముందు  డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపింది కోర్టు. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును  అక్టోబర్ 28వ తేదీన రిజర్వ్ చేసింది. 

అయితే ఈ కేసు నుండి తప్పించుకొనేందుకు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనను విన్పించారు. ఈ కేసుతో తమ ప్రమేయం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు తెలిపారు. 

అయితే వీరి వాదనతో ఏసీబీ తరపు న్యాయవాదులు విబేధించారు. కేసు నుండి తప్పించుకొనేందుకు గాను డిశ్చార్జీ పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు. నిందితుల తరపున వాదనల్లో వాస్తవం లేదని ఏసీబీ కోర్టు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.