బాలానగర్‌లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంక్, ట్రాఫిక్ నిలిపివేత

Siva Kodati |  
Published : Jun 02, 2023, 07:02 PM IST
బాలానగర్‌లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంక్, ట్రాఫిక్ నిలిపివేత

సారాంశం

హైదరాబాద్‌ బాలానగర్‌లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే పెట్రోల్ బంక్ ఎదురుగానే బస్సు తగులబడుతూ వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాలానగర్‌కి ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు అధికారులు.

హైదరాబాద్‌ బాలానగర్‌లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఐడీపీఎల్ రీసెర్చ్ సెంటర్ వద్ద ఆగివున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే పెట్రోల్ బంక్ ఎదురుగానే బస్సు తగులబడుతూ వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాలానగర్‌కి ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు అధికారులు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu