Hyderabad: జూన్ 9 నుంచి రెండో దశ గొర్రెల పంపిణీ ప్రారంభం అవుతుందని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అలాగే, మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8, 9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో చేపల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
Telangana Sheep Distribution Scheme Phase II: జూన్ 9 నుంచి రెండో దశ గొర్రెల పంపిణీ ప్రారంభం అవుతుందని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అలాగే, మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8, 9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో చేపల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి నాటికి కోటి 28 లక్షల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు.
మాదాసి కురువలకు కూడా సబ్సిడీ పై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల కొల్హాపూర్ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆలంపూర్ MLA అబ్రహం ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన గొర్రెల పెంపకం వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మాదాసి కురువ లు కృతజ్ఞతలు తెలపడం… pic.twitter.com/eRzeKesQmq
— Talasani Srinivas Yadav (@YadavTalasani)
మొదటి దశలో గొల్ల కురుమ సామాజిక వర్గానికి చెందిన అర్హులైన సభ్యులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి 3.93 లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. రెండో విడతలో సుమారు 3.5 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. గొర్రెల యూనిట్ల కొనుగోలుకు లబ్ధిదారులను అధికారులతో పాటు తీసుకెళ్లాలన్నారు. పారదర్శకత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ మందులు, పశుగ్రాసం, బీమా, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరిన శ్రీనివాస్ యాదవ్.. తమను ఈ పథకం కింద లబ్ధిదారులుగా చేర్చాలని మాదాసి కురువ సామాజికవర్గం చేసిన విజ్ఞప్తులను ఆమోదించారు.
లబ్దిదారులు పాలుపంచుకునేలా..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో వివిధ పథకాల కింద లబ్ధిదారులు పాల్గొనేలా పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖల అధికారులను ఆదేశించారు. ముందుగానే ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి, గొర్రెల పంపిణీ పథకంలో వారి భాగస్వామ్యం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.
జూన్ 8, 9, 10 తేదీల్లో అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
ఈ నెల 8, 9, 10 తేదీల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. శిక్షణ పొందిన మహిళా మత్స్యకారులు తయారు చేసిన ఫిష్ ఫ్రై, బిర్యానీ, ఫిష్ సూప్ వంటి వంటకాలను అన్ని జిల్లాల్లో 20 నుంచి 30 చొప్పున స్టాల్స్ ఏర్పాటు చేసి వడ్డిస్తారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారనీ, అదే రోజు ఆయా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని తెలిపారు. జూన్ 3న తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైతువేదికల్లో నిర్వహించే రైతు దినోత్సవంలో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. జూన్ 8న చెరువు పాండుగలో భాగంగా అన్ని రిజర్వాయర్లలో చేపలు, రొయ్యల పంపిణీని స్టాల్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేపపిల్లల పంపిణీ చేపట్టనున్నారు. అలాగే, హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పశువైద్యశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.