నల్గొండలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు...

Published : May 31, 2022, 06:32 AM IST
నల్గొండలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు...

సారాంశం

నల్గొండలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో బస్సులో 34మంది ప్రయాణికులున్నారు. 

నల్గొండ : Nalgonda జిల్లా వేములపల్లి వద్ద private travels బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మిర్యాల గూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెల్తుండగా ఈ ఘటన జరిగింది. 

కాగా, సోమవారం ఏపీలోని రెంటచింతలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులతో వారంతా శివుడి దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం పూర్తికావడంతో వారంతా సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దుల్లోకి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లో వారి ఇంటి వద్ద దిగి పోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. నెత్తురోడుతూ హాహాకారాలు..  చిమ్మ చీకట్లో రక్షించండి.. అని ఆర్తనాదాలు.. ఆదివారం అర్ధరాత్రి రెంటచింతల రహదారి ఈ భయానక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. 

రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరుకు రవాణా చేసే టాటా ఏస్ వాహనంతో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న వీరి వాహనం రెంటచింతల  పొలిమేరలోకి రాగానే  స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. వాహనం పల్టీలు కొట్టడంతో  అందులో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు.

ప్రమాదానికి కారణం అదే.. : మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ ప్రవహిస్తుంది.  ఇక్కడ స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ అంతా చీకటిగా ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు అక్కడే ఆగి ఉన్న వాహనాలు కనిపించవు. దీంతో రహదారిపై ప్రయాణం చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.  కానీ వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ నిత్యం తిరిగే రహదారి అనే నిర్లక్ష్యంతో వేగంగా దూసుకెళ్ళాడు.  రహదారిపై ఆగి ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. క్షతగాత్రులను 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, తీవ్ర గాయాలైన మరో ఇద్దరు గురజాల ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులు అందరిని  గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇదిలా ఉండగా, మే 27న Siddipet జిల్లా జగదేవ్పూర్ మండలం అలీ రాజ్ పేట్ బ్రిడ్జి వద్ద ఘోర road accident జరిగింది. జగదేవ్ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలు మెదక్ వెళ్తోంది.  ఆటోకి ఎదురుగా వస్తున్న లారీ alirajpet వద్ద ఢీకొంది.  ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  తీవ్రగాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యలో మరణించారు.  మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవ్పూర్ లో విషాదఛాయలు అలముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?