హైద్రాబాద్ లో టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం: నిమ్స్ లో చికిత్స

Published : May 30, 2022, 10:02 PM ISTUpdated : May 30, 2022, 10:06 PM IST
 హైద్రాబాద్ లో టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం: నిమ్స్ లో చికిత్స

సారాంశం

టీవీ నటి మైథిలి సోమవారం నాడు రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన నివాసంలోనే ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

హైదరాబాద్:


హైదరాబాద్: TV  నటి Mythili సోమవారం నాడు రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన నివాసంలోనే విషం తాగి Suicide attempt కి పాల్పడింది. ఈ విషయం తెలిసిన  కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు.

కుటుంబ కలహాల కారణంగానే మైథిలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే ప్రచారం కూడా సాగుతుంది. గతంలో కూడా భర్తపై మోతె పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఇవాళ కూడా భర్తపై మైథిలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై అధికారులు ధృవీకరించాల్సి ఉంది.మైథిలి ఆత్మహత్యాయత్నంపై  పోలీసుల నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కూడా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే