అధిక వడ్డీ పేరుతో హైద్రాబాద్ లో కి'లేడీ'రూ. 4 కోట్లు మోసం: పోలీసుల అదుపులో ముగ్గురు

Published : May 30, 2022, 09:14 PM IST
 అధిక వడ్డీ పేరుతో హైద్రాబాద్ లో కి'లేడీ'రూ. 4 కోట్లు మోసం: పోలీసుల అదుపులో ముగ్గురు

సారాంశం

హైద్రాబాద్ వనస్థలిపురంలో అధిక వడ్డీ పేరుతో రూ. 4 కోట్లు మోసం చేసిన మహిళపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్వర్ణలత సహా మరో మగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ వనస్థలిపురంలో అధిక వడ్డీ పేరుతో రూ. 4 కోట్లు మోసం చేసి మహిళపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad  వనస్థలిపురంలో Swarnalatha అనే మహిళపై బాధితులు పిర్యాదు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి రూ. 4 కోట్ల మోసం చేసిందని బాధితులు  vanasthalipuram పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుల పిర్యాదు మేరకు స్వర్ణలత సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అధిక వడ్డీల పేరు చెప్పి గతంలో కూడా మోసం చేసిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. 2021 ఏప్రిల్ 23న అధిక వడ్డీల పేరుతో వంచన చేసిన ఘటనలో ఏజెంట్ బట్టా మహేంద్ర చౌదరిని అరెస్టు  చేశారు. నిందితుడి నుండీ కారు, ల్యాప్ టాప్ , సి.పి.యు. కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

 రామగిరి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సునీల్ కడియాల, సంతోష్ కుమార్ కడియాల ఇద్దరూ అన్నదమ్ములు. సునీల్ కడియాల భార్య స్వాతి బాయి అలియాస్ స్రవంతి అనంతపురములో ఈబిఐడిడి ట్రైడర్స్ కంపెనీని ప్రారంభించారు. ఈ  కంపెనీలో సునీల్ కడియాల, సంతోష్ కుమార్ కడియాల డైరెక్టర్లు గా వున్నారు. 

స్వాతి బాయి అలియాస్ స్రవంతి కోశాధికారిగా ఉంటున్నారు. ఈ కంపెనీలో ధర్మవరం మండలం చింతలపల్లికి చెందిన బట్ట మహేందర్ చౌదరి అలియాస్ మహి (37) ను జిల్లా ఏజెంట్ గా చేర్చుకున్నారు. ఈ కంపెనీ షేర్ మార్కెట్ కి సంభంధించినదని ఆఫ్ లైన్ ట్రేడింగ్ అని నమ్మబలికారు. 

ఒక షేర్ విలువ రూ. 2,500/- రూపాయలు అని నమ్మించారు. .ఒక షేర్ కొంటే ఒక నెలకు 2500+1200 = రూ. 3,700/- రూ,,లు తిరిగి చెల్లిస్తామని ఏజెంట్ లతో చెప్పారు. బట్టా మహేంద్ర చౌదరి 2019 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఏజెంట్ గా పనిచేస్తూ అతని కింద అతని బావమరిది సుధాకర్ నాయుడు,  ఇంకా 6 మంది వ్యక్తులను ఏజెంట్లుగా చేర్చుకుని ధర్మవరం రూరల్ మండలములో చింతలపల్లి, వసంతపురము, ముదిగుబ్బ, రామ గిరి, అనంతపురము టౌన్, తాడిమర్రి, తాడిపత్రి, అనంతపురం జిల్లాలో పలుచోట్ల చాలా మంది కస్టమర్లతో  ఈబిఐడిడి ట్రైడర్స్ కంపెనీ పేరుతో.. సుమారు 40 కోట్ల రూపాయలు డిపాజిట్ రూపం లో వసూలు చేశారు. 

 సునీల్,  అతని భార్య స్వాతి బాయి అలియాస్ స్రవంతి, మహేంద్ర చౌదరి డిపాజిటర్లకు డబ్బులు ఇవ్వకుండా వారి సొంత ఖర్చులకు వాడుకుంటూ డిపాజిటర్ల డబ్బులు అడిగిన ప్రతిసారి కంపెనీలో ఆడిటింగ్ జరిగిన తరువాత ఇస్తామని చెప్పి నమ్మబలికి తప్పించుకుని తిరిగేవాళ్లని పోలీసులు చెప్పారు.  బాధితులు పిర్యాదు చేయడంతో  ధర్మవరం రూరల్ పోలీసు స్టేషన్, జిల్లాలో పలు పోలీసు స్టేషన్ లలో పోలీసులు కేసులు రిజిస్టర్ చేశారు.ఈ విషయం తెలిసిన 
 సునీల్, సంతోష్ కుమార్ లు నాగపూర్ కు పారిపోయారని పోలీసులు చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu