సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం: ప్రత్యేక పూజలు చేసిన మోడీ

By narsimha lode  |  First Published Mar 5, 2024, 10:22 AM IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పూజలు చేశారు.


హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  మంగళవారం నాడు సికింద్రాబాద్  ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.మహారాష్ట్ర పర్యటన ముగించుకొని సోమవారం నాడు రాత్రి ప్రధాన మంత్రి హైద్రాబాద్ కు చేరుకున్నారు. హైద్రాబాద్ రాజ్ భవన్ లో రాత్రి మోడీ బస చేశారు.  ఇవాళ  ఉదయం పది గంటల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  రాజ్ భవన్ నుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

 

PM Shri performs Pooja & Darshan at Sri Ujjaini Mahakali Devasthanam in Hyderabad, Telangana. https://t.co/9E2Wt9V50q

— BJP (@BJP4India)

Latest Videos

undefined

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా పూజలు చేయడానికి రావడంతో ఈ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ నుండి  ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లే మార్గంలో  భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.

ఆలయంలో  అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని.  మోడీ పర్యటన నేపథ్యంలో  ఆలయం వద్ద భారీగా  బందోబస్తును ఏర్పాటు చేశారు.  ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత  ప్రధాన మంత్రి  బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి  ప్రత్యేక హెలికాప్టర్ లో  సంగారెడ్డికి బయలుదేరారు.
 



 

click me!