బడుగు, బలహీనవర్గాల సమస్యలు గద్దర్ పాటల్లో ప్రతిబింబిస్తాయి: విమలకు మోడీ లేఖ

By narsimha lode  |  First Published Aug 25, 2023, 12:23 PM IST


ప్రజా యుద్దనౌక గద్దర్ మృతిపై  ప్రధాని నరేంద్ర మోడీ  సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు గద్దర్ సతీమణి విమలకు  ఆయన లేఖ రాశారు.



హైదరాబాద్: దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దర్ సతీమణికి ప్రధాని నరేంద్ర మోడీ  లేఖ రాశారు. గద్దర్ మృతి పట్ల నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గద్దర్ మృతిపై  కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. బడుగు,బలహీనవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను  గద్దర్ పాటలు ప్రతిబింబిస్తాయని  మోడీ గుర్తు చేశారు. 

ఈ నెల  6వ తేదీన  గద్దర్ మృతి చెందారు. ఈ ఏడాది జూలై  20వ తేదీన గుండెపోటుతో  గద్దర్ హైద్రాబాద్ బేగంపేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరారు. గద్దర్ కు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే  గద్దర్ కు ఊపిరితిత్తులు, యూరినరీ ఇన్ ఫెక్షన్ కారణంగా మృతి చెందినట్టుగా  ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.  ఈ నెల  7వ తేదీన  గద్దర్ అంత్యక్రియలను బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారంగా  నిర్వహించారు.

Latest Videos

also read:గద్దర్ పై కాల్పుల ఘటనలో నాపై దుష్ఫ్రచారం: చంద్రబాబు

 రాష్ట్ర ప్రభుత్వం గద్దర్  అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించింది.  ఉమ్మడి ఏపీ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా గద్దర్ తన ఆట, పాటల ద్వారా ప్రసిద్ది పొందారు. మావోయిస్టు ఉద్యమంలో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు.  2012లో మావోయిస్టు పార్టీకి గద్దర్ రాజీనామా చేశారు.   బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం సాధించే దిశగా  చివరి రోజుల్లో గద్దర్ ప్రయత్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారిగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

click me!