మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన అనుచరులు నాయకన్ గూడెం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలను చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామమైన నాయకన్ గూడెం వద్ద ఆయన అనుచరులు శుక్రవారం నాడు ఘనంగా స్వాగతం పలికారు. కార్యర్తలను చూడగానే తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగానికి గురయ్యారు.నాయకన్ గూడెం నుండి ర్యాలీగా అనుచరులతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పట్టణానికి బయలుదేరారు. ఖమ్మం పట్టణంలో అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశం కానున్నారు.
ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కలేదు. పాలేరు అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. ఈ స్థానం నుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం చేసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు కేటాయించలేదు.దీంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తికి గురయ్యారు.
undefined
దీంతో సీఎం కేసీఆర్ తన దూతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును , మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావును తుమ్మల నాగేశ్వరరావు వద్దకు పంపారు. ఎన్నికల తర్వాత నామినేటేడ్ పదవిని ఇస్తామని కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని నామా నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
ఇదిలా ఉంటే బీజేపీ , కాంగ్రెస్ పార్టీల నుండి తుమ్మల నాగేశ్వరరావు నుండి ఆఫర్లున్నాయి. దీంతో ఏ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరుతారనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ కార్యకర్తల సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి ప్రకటన చేస్తారోనని రాజకీయవర్గాలు ఆసక్తి నెలకొంది.
also read:తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తాం: రేణుకా చౌదరి
2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు తుమ్మల నాగేశ్వరరావు. 2016లో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు.