
నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు శివాలయంలో దక్షిణ విషయంలో ఇద్దరు పూజారుల మధ్య గొడవ జరిగింది.ఈ గొడవకు జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Mellacheruvu temple ప్రధాన అర్చకుడు VishnuVardan Sharma ఆదేశాల మేరకు Narasimha అనే తాత్కాలిక పూజారి వాహన పూజ నిర్వహించాడు. పూజల సమయంలో భక్తులు పూజారికి దక్షిణ సమర్పించారు. అయితే వాహన పూజల సమయంలో భక్తుల నుండి వచ్చిన దక్షిణను తనకు ఇవ్వాలని అమ్మవారి ఆలయ జూనియర్ పూజారి ధనుంజయ శర్మ నరసింహను అడిగారు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడిని అడిగి ఈ డబ్బులను ఇస్తానని చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకంది. ఈ గొడవ తీవ్రంగా మారింది. ధనుంజయ శర్మ తాత్కాలిక పూజారిగా పనిచేసిన నరసింహ పై దాడికి దిగాడు. అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాత్కాలిక పూజారిపై దాడి చేసిన జూనియర్ పూజారి ధనుంజయ శర్మపై దేవాదాయ శాఖాధికారులు వేటు వేశారని సమాచారం. ధనుంజయ శర్మను విధుల నుండి తప్పించారని తెలుస్తుంది. ఆలయంలో భక్తులు ఇచ్చిన దక్షిణ విషయంలో తాత్కాలికంగా పనిచేస్తున్న పూజారిపై ధనుంజయ శర్మ దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిని అడ్డుకొనేందుకు ఆలయంలో పనిచేస్తున్న మరో వ్యక్తి కూడా ప్రయత్నించాడు. అయినా కూడా ధనుంజయ శర్మ ఆగలేదు. ఈ ఘటన ఈ నెల 23వ తేదీన చోటు చేసకొంది. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో వెలుగు చూసింది.