హైదరాబాద్ ఐఐటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి.. హరితహారంలో మొక్కలు నాటిన రామ్‌నాథ్

First Published Aug 5, 2018, 1:22 PM IST
Highlights

సంగారెడ్డి జిల్లా కంది శివారులోని హైదరాబాద్ ఐఐటీ ఏడవ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఐటీలో కోర్సును పూర్తి చేసుకున్న 560 మంది విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. 

సంగారెడ్డి జిల్లా కంది శివారులోని హైదరాబాద్ ఐఐటీ ఏడవ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఐటీలో కోర్సును పూర్తి చేసుకున్న 560 మంది విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఐఐటీ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు..

అంతకు ముందు హరితహారంలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్‌నాథ్ కోవింద్ మొక్కలు నాటారు. హైదరాబాద్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన చెన్నైకి బయలుదేరుతారు. అక్కడ కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని రాష్ట్రపతి పరామర్శించునున్నారు.

click me!