లాల్‌దర్వాజా బోనాల్లో తప్పిన పెను ప్రమాదం.. ఒరిగిన భారీ కమాన్.. భక్తులు సురక్షితం

First Published Aug 5, 2018, 12:46 PM IST
Highlights

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల్లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. అక్కన్న, మాదన్న దేవాలయం దగ్గర భారీ కమాన్ ఒకటి ఒరిగిపోవడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల్లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. అక్కన్న, మాదన్న దేవాలయం దగ్గర భారీ కమాన్ ఒకటి ఒరిగిపోవడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.. ఆ కమాన్ భక్తులపై పడకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బోనాల సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అంతకు ముందు సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

click me!