
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) స్వాగతం పలికారు. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటుగా ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి రాష్ట్రపతి కోవింద్ దంపతులు హెలికాఫ్టర్‌లో ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ ఆశ్రమానికి బయలుదేరారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ముచ్చింతల్ చేరుకుని శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు.
భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ఆలయాలు, బృహాన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
ఆ తర్వాత చినజీయర్ ఆశ్రమం నుంచి హెలికాఫ్టర్‌లో రాష్ట్రపతి దంపతులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి బస చేసిన తర్వాత రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.