మేడారం జాతరకు.. 3 రోజుల పండుగ, 9 వేల మంది పోలీసులతో భద్రత : డీజీపీ మహేందర్ రెడ్డి

By Siva KodatiFirst Published Feb 13, 2022, 2:48 PM IST
Highlights

మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు 9 వేల మంది పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు

మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (dgp mahender reddy) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు 9 వేల మంది పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాస్తున్నామని.. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్‌ప్లే  బోర్డులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని.. 37 చోట్ల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేశామని.. 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. జాతర ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద అధునాతన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. 

అటు.. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు (sammakka sarakka jatara) టిఎస్ఆర్టీసి (tsrtc) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్ (sajjanar) వివరాలు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఎక్కాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.  మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ (tsrtc app) ప్రవేశపెట్టామని.. ఆర్టీసి చరిత్రలోనే మొదటిసారి ఈయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ యాప్ లో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతో పాటు ఇతర టూరిస్టు ప్రాంతాలు, ప్యాకేజీలతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్లు, సమీపంలోని హోటల్స్ కంటాక్టులను ఉంచామని తెలిపారు. 

50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని ఆయన గుర్తుచేశారు. మొదట రెండెంకల బస్సులతో 1970లో ప్రారంభమయ్యిందని.. ప్రస్తుతం అది 7 వందలకు పెరిగిందని సజ్జనార్ అన్నారు. గతేడాది 19 లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామని... అప్పుడు 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్పులు నడిపామని ఆయన వెల్లడించారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని .. గతేడాది 30 కోట్ల ఆదాయం వచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సారి 3,845 బస్సులు నడుపుతున్నామని.. మొత్తం 51 పాయింట్స్ నుంచి మేడారానికి బస్సులు తిరుగుతాయని చెప్పారు.  ఇతర రాష్ట్రాలు నుంచి కూడా బస్సులు నడుపుతున్నామని సజ్జనార్ వెల్లడించారు. 

30 మంది ప్రయాణికులు ఉంటే 040 30102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు. ఆర్టీసీ వెబ్ సైట్‌ను చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఈనెల 13వ తేదీ నుంచి జాతరలో రద్దీ పెరుగుతుందని.. 12వేల మంది సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. 8 రోజుల పాటు ఆర్టీసి అధికారులు మేడారంలో ఉంటారని, 50 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఆర్టీసి ఆధ్వర్యంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్టీసి ఆధ్వర్యంలో 3 వందల మంది ప్రత్యేకంగా వాలంటర్స్ గ్రౌండ్‌లో ఉంటారని, వరంగల్ నుంచి 2 వేలకు పైగా బస్సులు నడుపుతున్నామని టీఎస్ఆర్టీసీ ఎండి తెలిపారు. 

click me!