
గోషామహల్: పొగత్రాగడం (smoking) ప్రాణాలకు హానికరమని ఎవరెంత మొత్తుకున్నా తాగేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు అనేక రకాల శ్వాస సంబంధిత వ్యాదులకు పొగ తాగడమే ప్రధాన కారణం. ఈ విషయం ప్రతిఒక్కరికీ తెలుసు... అయినా పొగతాగుతాగడం మానేయరు. ఇలా ధూమపానం కారణంగా మంచానపడినా పొగతాగడం మాత్రం మానేయకలేకపోయాడు ఓ వ్యక్తి. చివరకు అదే సిగరెట్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిల మధుకర్(60) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడు మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబసభ్యులు పనులపై బయటకు వెళ్ళగా ఇంట్లో ఒక్కడే వుండేవాడు.
ఇలా రోజూ మాదిరిగానే గత శుక్రవారం కుటుంబసభ్యులంతా పనులపై బయటకు వెళ్లారు. ఈ సమయంలో మధుకర్ మంచంపై పడుకునే సిగరెట్ తాగడానికి ప్రయత్నించాడు. కానీ సిగరెట్ నిప్పురవ్వలు మంచంపై వున్న బట్టలపై పడి రాజుకున్నాయి. ఈ విషయాన్ని మధుకర్ గమనించలేదు. దీంతో మంటలు చెలరేగి మంచానికి అంటుకున్నాయి. నడవలేని స్థితిలో వున్న మధుకర్ ఈ సిగరెట్ ద్వారా చెలరేగిన మంటల్లో చిక్కుకున్నాడు.
మంటలకు గమనించిన చుట్టుపక్కల వారు ఇంట్లోకి చేరుకునే లోపే మధుకర్ 70శాతం కాలిపోయాడు. మంటలను ఆర్పి కొనఊపిరితో వున్న అతడికి సమీపంలోని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ పరిస్థితి పూర్తిగా విషమించడంతో మధుకర్ శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిగరెట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఇలా దూమపానానికి అలవాటుపడిన వ్యక్తి అదే సిగరెట్ వల్ల చెలరేగిన మంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.