ఉన్న ఒక్క స్తంభం పెరికేస్తే ఎలా?

Published : Feb 06, 2017, 01:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఉన్న ఒక్క స్తంభం పెరికేస్తే ఎలా?

సారాంశం

తాము పవిత్రంగా భావించే  రాజీవ్ సద్భావనా యాత్ర స్తంభాన్ని ఎవరో పెరికేశారని  సిటీ కాంగ్రెసోళ్లు నారాజ్ అవుతున్నరు

హైదరాబాద్ లో కాంగ్రెసోల్ల కష్టాలు...ఎన్నో.

 

నగరంలో వాళ్లకు మిగిలిందంతా  రెండే అడ్రసులు.. నాంపల్లి గాంధీభవన్, చార్మినార్ రాజీవ్ సద్భావనా యాత్ర స్తంభం. కాకపోతే, బోలేడు మాజీలు. ఒక మైనారిటీ ఎంపి ఖాన్ కూడా ఉన్నారనుకోండి అది వేరేవిషయం.

 

సిటీలో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ లోకి చేరిపోయారు. అందువల్ల మాజీలంతా ఒక్కొక్కసారి గాంధీ భవన్ లో ఏడాదికొకసారి చార్మినార్ రాజీవ్ సద్భావనా స్థంభంకాడా కలుసుకుంటుంటారు.

 

ఇట్లాంటపుడు ఆ ఉన్న స్థంభం పెరికేస్తే ఎలా... ఇది చాలా సీరియస్ అని  కాంగ్రెస్ నాయకులు గుస్సా అయిపోతున్నారు.

 

 ఈ స్తంభం ఫిబ్రవరి నాలుగో తేదీన మాయమయింది. ఆరోజు నిజాంబాద్ ఎంపి కవిత ఈ ప్రాంతంలో జరిగే ముషాయిరా కోసం వచ్చారు.  ఆ రోజు మాయం కావడంలో ఏదో మతలబు ఉందన్నది కాంగ్రెసోల్ల అనుమానం.

 

దీని సంగతేందో తెల్చండని ఈరోజు రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక కమిటీ ప్రతినిధి బృందమొకటి పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలుసుకుని స్తంభం పెరికేయడం మీద దర్యాప్తు చేయాలని కోరారు.

 

 కమిటీ ఛెయిర్మన్  జి నిరంజన్,  ఇతరనాయకులు సయ్యద్ యూసఫ్ హష్మి, జి రాజరత్నమ్,  జి కన్నియలాల్, పి.రాజేశ్ కుమార్, ఎస్ పి క్రాంతికుమార్, రాజు యాదవ్, దాళ్లు శివ తదితరులు కమిషనర్ ను కలుసుకుని దోషులెవరోకొనుగొని కఠినంగా శిక్షించాలని కోరారు.

 

స్తంభం కోసం నిన్న ధర్నా కూడా చేశారు.

 

చార్మినార్ కాడ కాంగ్రెస్ కు ఏమీ లేకపోయినా, ఈ పోల్ పాతి, ప్రతి సంవత్సరం చాలా హంగామా చేస్తుంటారు. అక్కడ  రాజీవ్ సద్భావనా యాత్ర పేరుతో పెద్ద మీటింగ్ పెడతారు. వూరేగింపు దీస్తారు. పోయిన సారి ఎఐసిసి  జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ కూడా వచ్చారు.

 

పార్టీకి గాంధీ భవన్ తర్వాత అంత ముఖ్యమయిన, పవిత్రమయిన స్థలమయింది పోల్ ఉన్న జాగా. పవర్ లో ఉన్నా లేక పోయినా రాజీవ్ గాంధీ యాత్ర  మాత్రం గొప్పగా చేస్తుంటారు.దీనికంతటికి స్టార్టింగ్ పాయింట్ ఈ స్థంభమే. అందువల్ల కాంగ్రెస్ వోల్డ్ సిటి అడ్రసు ను లేపేస్తే...ఎలా అనేది వాళ్ల ప్రశ్న.

 

సద్భావన స్తంభం పెరికేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరేది అందుకే.

 

అంతకుముందు, రాజీవ్ సద్భావనాయాత్ర  క్రమం తప్పకుండాప్రతి ఏడాది జరిపే మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించి స్తంభం పెరికేసిన  సంఘటన గురించి వాకబుచేశారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు