సర్పంచ్ గా పోటీచేసే అవకాశం రాక.. గర్భిణి ఆత్మహత్య

Published : Jan 29, 2019, 03:51 PM IST
సర్పంచ్ గా పోటీచేసే అవకాశం రాక.. గర్భిణి ఆత్మహత్య

సారాంశం

సర్పంచ్ గా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదనే మనస్థాపంతో ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. 

సర్పంచ్ గా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదనే మనస్థాపంతో ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ సంఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..ఊట్లపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన రెబక్కారాణి(26) టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దింపేందుకు స్థానిక నాయకులు కుటుంబసభ్యులతో చర్చించి ఆమె వివరాలు తీసుకున్నారు. ఆమె ఏడు నెలల గర్భిణీ కావడంతో.. ఆ అవకాశం మరో మహిళకు ఇచ్చారు.

ఆ మహిళ మొన్న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో రెబక్కా రాణి తీవ్ర మనస్థాపానికి గురైంది. సర్పంచిగా తాను ఉండాల్సిన స్థానంలో వేరే మహిళ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా