కోట్లలో టోకరా: గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్

Published : Jan 29, 2019, 03:39 PM ISTUpdated : Jan 29, 2019, 04:41 PM IST
కోట్లలో టోకరా: గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్

సారాంశం

గ్రీన్ గోల్డ్ బయోటెక్   ఎండీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. వేరుశనగ నుండి నూనె తీసే పేరుతో  ప్రజల నుండి  డబ్బులు వసూలు చేశారని భగవత్ చెప్పారు.  

హైదరాబాద్:గ్రీన్ గోల్డ్ బయోటెక్   ఎండీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. వేరుశనగ నుండి నూనె తీసే పేరుతో  ప్రజల నుండి  డబ్బులు వసూలు చేశారని భగవత్ చెప్పారు.

మంగళవారం నాడు మహేష్ భగవత్  హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో  గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ చైన్ సిస్టమ్ ద్వారా ప్రజల నుండి  డబ్బులు వసూలు చేసినట్టు  మహేష్ భగవత్ చెప్పారు.

పల్లి నూనె స్కాం పేరుతో ఈ పథకం విశేషంగా ప్రాచుర్యం పొందింది.  ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన శ్రీకాంత్‌ను  అరెస్ట్ చేశారు. సైబరాబాద్ లో శ్రీకాంత్ పై సైబరాబాద్, నిజామాబాద్, సీసీఎస్ హైద్రాబాద్,  వరంగల్ , కడప జిల్లాలో తదితర పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదైనట్టు సీపీ భగవత్ చెప్పారు.

శ్రీకాంత్ తో పాటు, భాస్కర్ యాదవ్, లంకా ప్రియ , అహల్యరెడ్డి, అనిల్ రెడ్డి, అంజయ్య గౌడ్, సంతోష్ లను అరెస్ట్ చేసినట్టు భగవత్ తెలిపారు.
నిందితుల నుండి రూ.21 లక్షలను స్వాధీనం చేసుకొన్నట్టు  ఆయన తెలిపారు. బ్యాంకులో  సుమారు 90 లక్షల నగదును సీజ్ చేసినట్టు  సీపీ తెలిపారు.
వేరుశనగ నూనె తీసే మిషన్లతో పాటు, వేరుశనగ, ఇతర వస్తువులు కలిపి సుమారు రూ. 5 కోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని  సీపీ భగవత్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు