ఓటుకు నోటు కేసు: ఆ పిటిషన్ జాప్యానికేనని టీ ప్రభుత్వం

By Nagaraju TFirst Published Jan 29, 2019, 3:49 PM IST
Highlights

ఓటుకు నోటు కేసును మరింత ఆలస్యం చేసేందుకు ఇంప్లీడ్ పిటీషన్ ను దాఖలు చేశారని ఇది ఒక ఎత్తుగడ అంటూ ప్రభుత్వ న్యాయవాది హరేన్ ధావల్ ఆరోపించారు. గతంలో ఉదయ్ సింహా ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ స్వీకరించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జనవరి 29కి కేసు విచారణను వాయిదా వేశారు. 

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. 

ఓటుకు నోటు కేసును మరింత ఆలస్యం చేసేందుకు ఇంప్లీడ్ పిటీషన్ ను దాఖలు చేశారని ఇది ఒక ఎత్తుగడ అంటూ ప్రభుత్వ న్యాయవాది హరేన్ ధావల్ ఆరోపించారు. గతంలో ఉదయ్ సింహా ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ స్వీకరించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జనవరి 29కి కేసు విచారణను వాయిదా వేశారు. 

అయితే వ్యక్తిగత కారణాలతో తాను కోర్టుకు హాజరు కాలేనని తనకు రెండు వారాలపాటు సమయం కావాలని ఉదయ్ సింహ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా న్యాయమూర్తికి లేఖ రాశారు. సిద్ధార్థ లూత్రా అభ్యర్థనను సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. 

ఇకపోతే ఈ కేసులో మరో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇకపోతే 2015 మే 30న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభాలు పెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు. 

ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గ ఆడియోలు కూడా బయటపడ్డాయి. స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగర్ కు చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక సైతం ఇచ్చింది. 

click me!