అతనో రాక్షసుడు, ఉన్మాది, నా శవాన్ని తాకే అర్హత లేదు.. భర్తమీద డైరీలో రాసి గర్భవతి ఆత్మహత్య..

By Bukka Sumabala  |  First Published Aug 4, 2022, 2:10 PM IST

భర్త పెట్టే చిత్ర హింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఓ యువతి.. తన శవాన్ని భర్త, అత్తామామలు తాకడానికి వీల్లేదని..  అదే తల్లిదండ్రులు తనకు చేసే మేలు అంటూ రాసుకుని మరీ చనిపోయింది. 


హైదరాబాద్ : భర్త ఉన్మాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఓ మూడు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త మానసిక రోగి, రాక్షసుడని, అతడికి తన మృతదేహాన్ని తాకే అర్హత కూడా లేదంటూ డైరీలో రాసుకుంది. కలకలం రేపిన ఈ ఘటన బాలాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ భాస్కర్ కథనం ప్రకారం షాషీన్ నగర్ జుబైద్ కాలనీలో ఉండే దంపతులు ఖాజా మొహియుద్దీన్ అన్సారీ, షబానా బేగం దంపతుల ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ (29) ఏంబీఏ చదివారు. 

చార్మినార్ ఫతేదర్వాజాకు చెందిన వ్యాపారి సుల్తాన్ పటేల్ (30)తో నిరుడు ఫిబ్రవరిలో వివాహం అయ్యింది. అప్పటినుంచి ఆమె ఎవ్వరితో మాట్లాడినా భర్త అనుమానించేవాడు.. బెల్టు, కర్రలతో చితకబాదేవాడు. ఆడబిడ్డ భర్త, ఆమె కుమారులతో మాట్లాడిని విచక్షణారహితంగా కొట్టేవాడు. తన ప్రవర్తన గురించి పుట్టింట్లో లేదా మరెవరికౌనా చెబితే రివాల్వర్ తో కాల్చి చంపుతానని బెదిరించేవాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు అందరికీ చూపిస్తానని హెచ్చిరించేవాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావమైతే ఆనందపడ్డాడు. 

Latest Videos

undefined

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌కు బెయిల్ మంజూరు

ఈ విషయాలన్నీ ఆమె తన డైరీలో రాసుకుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. ఆమెను చిత్రహింసలు పెట్టి తల్లిదండ్రుల వద్దే ఉండాలని హెచ్చరిస్తూ గతనెలలో పంపించేశాడు. ఈ నెల 1న షాహిన్ నగర్ లోని అత్తగారింటికి వచ్చి భార్యను దుర్భాషలాడుతూ చితకబాది వెళ్లిపోయాడు. ఇంతకాలం దాచిన తన భర్త నిజస్వరూపాన్ని పుట్టింటి వారికి వివరించి తనను కాపాడాలని వేడుకుంది ఆమె. 

అయితే, తల్లిదండ్రులు మాత్రం భార్యాభర్తలన్నాక గొడవలుంటాయాని తేలిగ్గా తీసిపారేశాడు. తరువాత మాట్లాడదాం అంటూ నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడంది. వేధింపులకు తాళలేక చనిపోతున్నానని, భర్త, అత్తామామలు.. తన మృతదేహాన్ని తాకకుండా అడ్డుకోవాలని కోరింది. అదే తల్లిదండ్రులుగా మీరు నాకు చేసే మేలు అని డైరీలో రాసింది. తల్లి ఫిర్యాదు తో బాలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం. 

click me!