సీనియర్ నేత డీ శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఎంపీ అరవింద్

Published : Feb 27, 2023, 12:40 PM ISTUpdated : Feb 27, 2023, 12:54 PM IST
సీనియర్ నేత డీ శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు చేసుకున్న ఎంపీ అరవింద్

సారాంశం

తెలంగాణ సీనియర్ నేత డీ శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు తనయుడు, ఎంపీ అరవింద్ ట్విట్టర్‌లో వెల్లడించారు.  

హైదరాబాద్: తెలంగాణ సీనియర్ లీడర్, పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. సోమవారం ఉదయం డీఎస్‌కు ఫిట్స్ వచ్చిందని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం డీఎస్‌కు చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితులను వైద్య పరీక్షల అనంతరం వెల్లడిస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

 

 

Also Read: మెడికో ప్రీతి కేసు.. హెచ్‌వోడీ నాగార్జునపై తీవ్ర విమర్శలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..

తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడటంతో బీజేపీ ఎంపీ అరవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రికి తీవ్ర అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కావున.. ఈ రోజు రేపు అంటే ఈ నెల 27వ తేదీ, 28వ తేదీన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు కార్యకర్తలకు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?