ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

By Nagaraju penumalaFirst Published Apr 27, 2019, 2:32 PM IST
Highlights

తన భర్తను దారుణంగా హత్య చేయించిన నిందితులకు బెయిల్ రావడంపై ప్రణయ్ భార్య ప్రధాన నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత ఆవేదన వ్యక్తం చేశారు. దేశన్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని ఆమె అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ కొట్టివేసి బెయిల్ పై విడుదల చేయడం దారుణమన్నారు. 

నల్గొండ: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరుకావడంతపై ప్రణయ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

తన భర్తను దారుణంగా హత్య చేయించిన నిందితులకు బెయిల్ రావడంపై ప్రణయ్ భార్య ప్రధాన నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత ఆవేదన వ్యక్తం చేశారు. దేశన్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని ఆమె అన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్ కొట్టివేసి బెయిల్ పై విడుదల చేయడం దారుణమన్నారు. 

నిందితులు బయటకు రావడం వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తమకు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. నిందితులకు ధైర్యం చెప్పి కోర్టు పంపినట్లు ఉందన్నారు. ఇప్పటికీ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె ఆరోపించారు. 

తన భర్త కేసులో ఏ2 నిందితుడు శ్రవణ్ కుమార్ భార్య ఇప్పటికీ ఫోన్లు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. బయట ఉన్న ఆమె అంత కక్ష ఉంటే లోపల ఉండి బయటకు వస్తున్న వారు మరింత కక్ష పెంచుకునే అవకాశం లేకపోలేదని తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

దీనిపై హైకోర్టుకు అప్పీల్ చేస్తామని, అలాగే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. మరోవైపు ప్రణయ్ తండ్రి బాలస్వామి సైతం బెయిల్ మంజూరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు హత్య కేసు నిందితులకు ఇంత త్వరగా వస్తుందని తాను ఊహించలేదన్నారు. 

నిందితులకు బెయిల్ మంజూరు అయినప్పటికీ వారికి కఠిన శిక్ష పడుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు. అటు నిందితుల భారీ నుంచి ప్రణయ్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ముప్పు కలగకుండా రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. 

నిందితులకు బెయిల్ లభించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఇకపోతే గతేడాది జరిగిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలకు శుక్రవారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శనివారం వారు వరంగల్ జైలు నుంచి విడుదల కానున్నారు. 

click me!