తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర: కమిటీకి ప్రణబ్ నేతృత్వం

By narsimha lodeFirst Published Aug 31, 2020, 6:27 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పేరుంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ పలు పార్టీల నుండి  అభిప్రాయాలను సేకరించింది.
 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పేరుంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ పలు పార్టీల నుండి  అభిప్రాయాలను సేకరించింది.

2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించింది. దీంతో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ, కేంద్రంలో కూడ టీఆర్ఎస్ భాగస్వామిగా చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 2005 మార్చిలో యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ ఛైర్మెన్ గా కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అప్పటి కేంద్రమంత్రులు దయానిధి మారన్, రఘువంశ్ ప్రసాద్ సింగ్ లను కూడ సభ్యులుగా చేర్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పలు పార్టీల నుండి అభిప్రాయాలను సేకరించేందుకు గాను  ఈ కమిటిని ఏర్పాటు చేసింది కేంద్రం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో తమ అభిప్రాయాలు తెలపాలని కోరుతూ ప్రణబ్ కమిటీ అన్ని పార్టీలకు లేఖలను రాసింది. ఈ కమిటీకి గడువును 8 వారాలు మాత్రమే ఇచ్చింది. అయితే నిర్ణీత గడువులోపుగా కమిటీ నివేదికను ఇవ్వలేదు.

ప్రణబ్ కమిటీకి 36 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు  ఇచ్చాయి. అప్పటి కేంద్ర మంత్రులు కేసీఆర్, నరేంద్రలు పలు పార్టీలను కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇవ్వాలని కోరారు.

యూపీఏ కూటమిలోని 13 పార్టీలలో 11 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధించాయి. యూపీఏ ప్రభుత్వాన్ని బయటనుండి సమర్థిస్తున్న 6 పార్టీలు 
ప్రతిపక్షమైన ఎన్డీయే కూటమిలోని 8 పార్టీలు కూడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. కొంతమంది స్వతంత్ర సభ్యులు స్పష్టంగా తన సమ్మతిని తెలియజేస్తూ రాతపూర్వకంగా తెలిపారు.

తెలంగాణపై తేల్చకుండా నాన్చుడు ధోరణిని అవలంభించేందుకు గాను ప్రణబ్ ముఖర్జీని ఏర్పాటు చేశారని కూడ అప్పట్లో కొందరు విమర్శలు కూడ చేశారు. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ యూపీఏకి గుడ్ బై చెప్పింది. 


 

click me!