తుపాకీతో కాంట్రాక్టర్ కు బెదిరింపులు: మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 31, 2020, 3:59 PM IST
Highlights

నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో  కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులను పరిహారం నిర్వహించకుండా చేయడంపై మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.


నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో  కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులను పరిహారం నిర్వహించకుండా చేయడంపై మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

పరిహారం చెల్లించిన తర్వాతే  పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పనులను ఆయన అడ్డుకొన్నారు.కాలువ పనులను అడ్డుకోవడానికి తన వద్ద ఉన్న తుపాకీతో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ తో పాటు ఇంజనీర్ ను బెదిరించాడు. తన భూమి నుండి కాలువ నిర్మాణ పనులు చేపట్టాల్సి వచ్చింది. అయితే  ఈ పనులకు పరిహారం చెల్లించలేదు. దీంతో పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాలువ పనులను అడ్డుకొన్నాడు.

ఈ విషయమై కాంట్రాక్టర్ తో పాటు ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు మాజీమంత్రి మోహన్ రెడ్డి బెదిరించినట్టుగా తేలిందని పోలీసులు చెప్పారు.

ఈ కేసులో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో వైపు ఆయన గన్ లైసెన్స్ ను కూడ రద్దు చేశారు. లైసెన్సుడ్ గన్ తో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా ఎస్పీ రంగనాథ్ హెచ్చరించారు.
 

click me!