పోటీలో లేని ప్రజాశాంతి పార్టీ.. కానీ, ఆ ప్రచారం చేస్తానంటున్న కేఏ పాల్

By Mahesh K  |  First Published Nov 11, 2023, 9:33 PM IST

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డోంట్ ఓట్ లేదా నోటా ట్యాగ్‌తో ప్రజల్లోకి వెళ్లుతామని చెప్పారు. ఈ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలను కోరుతామని వివరించారు. ప్రజాశాంతి పార్టీ ఇనాక్టివ్‌గా ఉన్నదని, ఆ పార్టీకి ఈసీ సింబల్ కేటాయించలేదు.
 


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ఫోకస్ ఉండే ప్రజా శాంతి పార్టీ, జనసేన పార్టీలకు ఈసీ నుంచి చిక్కులు ఎదురయ్యాయి. జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు లేని కారణంగా గ్లాస్ గుర్తును ఆ పార్టీకి రిజర్వ్ చేయలేదు. గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో జనసేన అభ్యర్థులందరికీ గ్లాస్ గుర్తు వస్తుందనే గ్యారంటీ లేకుండా పోయింది. అంతేకాదు, వారంతా స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రజా శాంతి పార్టీ పరిస్థితి ఇంతకంటే దారుణం. అసలు ప్రజా శాంతి పార్టీ యాక్టివ్‌గానే లేదని ఈసీ తెలిపింది. దీంతో ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం లేదు.

కొన్ని రోజులుగా ఈసీపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సీరియస్ అవుతున్నారు. అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా తమకు ఎన్నికల గుర్తు కేటాయించడం లేదని ఈసీ అధికారులపై ఆగ్రహించారు. ప్రజాశాంతి పార్టీ ఇనాక్టివ్‌గా ఉన్నదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈసీ అధికారులు కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఇనాక్టివ్ కారణంగా పోటీలో లేనందున కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని కోరారు.

Latest Videos

Also Read: SC Reservation: ఎస్సీ అభ్యర్థులు రిజర్వ్‌డ్ స్థానాలకే పరిమితమయ్యారా? ఏ పార్టీ ఎన్ని టికెట్లు కేటాయించింది?

లడాక్‌లో ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని ఎన్నికలు రద్దు చేశారని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడు తమ పార్టీ ఇనాక్టివ్ అని చెప్పి సింబల్ కేటాయించకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు చెప్పారు. 

ఈ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని కేఏ పాల్ పిలుపు ఇచ్చారు. ఓటు వేయొద్దని లేదా నోటాకు ఓటు వేయాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లుతానని వివరించారు. ఇదే విషయాన్ని ప్రచారం చేస్తానని అన్నారు. తెలంగాణలో పోటీ చేస్తామనే ధీమాతో ప్రజా శాంతి పార్టీ కొందరికి బీఫామ్‌లు కూడా అందించింది. కానీ, ఆ తర్వాత అవి వృథా అయ్యాయి.

click me!