బీజేపీతో బీఆర్ఎస్‌కు పొత్తు.. అందుకే మణిపూర్‌పై కేసీఆర్ మౌనం: కేఏ పాల్

By Mahesh K  |  First Published Jul 30, 2023, 6:56 PM IST

బీజేపీ, బీఆర్ఎస్‌లకు పొత్తు ఉన్నదని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. మణిపూర్ హింసపై కేసీఆర్ మౌనం దాల్చడమే ఇందుకు నిదర్శనం అని ఆరోపించారు. మణిపూర్ హింసకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 


హైదరాబాద్: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, బీఆర్ఎస్‌తో మరోసారి తేటతెల్లమైందని అన్నారు. ఈ పొత్తు వల్లే మణిపూర్ హింసపై దేశమంతటా ఆందోళన వ్యక్తం అవుతున్న కేసీఆర్ మాత్రం మౌనం దాల్చారని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నదని, అదే బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బీ టీమ్‌గా ఉన్నదని అన్నారు. కేసీఆర్ గురించి తెలిసే ప్రతిపక్ష పార్టీలు ఆయనకు ఆహ్వానం పంపలేదని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఖాయం అని బీజేపీ నేతలు బల్లగుద్ది చెప్పారని, ఆ తర్వాత మలుపు తిరిగిన పరిణామాలు రాష్ట్ర బీజేపీ నేతలకే అంతుచిక్కలేదని వివరించారు. కవితను అరెస్టు చేయకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతల్లోనే బీఆర్ఎస్‌తో సొంత పార్టీ సంబంధంపై అనుమానాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు స్పష్టమైపోయిందని, బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఒక అవగాహన ఉన్నదని ఆరోపించారు.

Latest Videos

Also Read: నితీశ్ కుమార్ మా మనిషే.. ఎప్పుడైనా తిరిగి ఎన్డీయేకు రావొచ్చు: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ హింసను నిరసిస్తూ హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేఏ పాల్ హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలను రక్షించుకోవాలంటే తమ పార్టీనే గెలిపించుకోవాలని ఆయన కోరారు. మణిపూర్‌లో అంతటి మారణహోమం జరిగినా.. అక్కడి సీఎం, హోం మంత్రి, డీజీపీలను తప్పించలేదని, ఈ వ్యవహారం చూస్తుంటే దాని వెనుక నరేంద్ర మోడీ హాస్తం ఉన్నదని అర్థం అవుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. 

click me!