ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీపై విరుచుకుపడుతూ.. జేడీ లక్ష్మీనారాయణ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ తెలంగాణ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే ఆయనను చిత్తుచిత్తుగా ఓడించడానికి తెలుగువాడిగా తానూ బరిలో దిగుతానని చెప్పారు. జేడీ లక్ష్మీ నారాయణ కొత్త పార్టీ పెట్టడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు సుమారు రూ. 1000 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు.
KA Paul: ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అదే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. మాజీ బ్యూరోక్రాట్ జేడీ లక్ష్మీనారాయణపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు. ప్రజా శాంతి పార్టీకి ఇక సింబల్ రానుందని, వచ్చే ఎన్నికల్లో దుమ్ము రేపడమేనని అన్నారు.
జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నారని, ఇందుకోసం ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు సుమారు రూ. 1000 కోట్లు ఇచ్చాయని కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశాయని అన్నారు. ఈ అప్పులను ఎవరూ తీర్చలేరని, అది కేవలం తనతోనే సాధ్యం అవుతుందని వివరించారు. ఈ ప్రభుత్వాలు అవి చేసిన అప్పులకు కనీసం వడ్డీలు కూడా కట్టడం లేదని ఆరోపించారు. టాపిక్ డైవర్ట్ చేస్తూ ఇతర సాకులు చెబుతూ కాలం గడిపేస్తాయని మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలోని సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంటు బరిలో నిలబడతారనే వార్తలు వస్తున్నాయని, ఒక వేళ ఆయన నిజంగానే తెలంగాణ నుంచి పోటీ చేస్తే తాను తెలుగు వాడి సత్తా చూపిస్తానని కేఏ పాల్ అన్నారు. మోడీని చిత్తు చిత్తుగా ఓడిస్తానని పేర్కొన్నారు. గతంలో మోడీ ప్రభుత్వం.. తనను ఆహ్వానించి కేంద్ర విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టాలని ఆఫర్ చేసిందని, కానీ, తాను తిరస్కరించానని వివరించారు.
Also Read : రేవంత్ ను ఓడించేందుకు అంత పని చేసాారా..? పరారీలో మాజీ డిప్యూటీ మేయర్, పోలీసుల గాలింపు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చిన విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు. ఈ ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు తనది గ్యారంటీ అని అన్నారు. తన లాంటి వ్యక్తికి పార్లమెంటు లో మాట్లాడే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.