YS Sharmila Padayatra: ఉదయసముద్రం ప్రాజెక్ట్ ను పరిశీలించిన వైఎస్ షర్మిల (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Nov 09, 2021, 01:27 PM IST
YS Sharmila Padayatra: ఉదయసముద్రం ప్రాజెక్ట్ ను పరిశీలించిన వైఎస్ షర్మిల (వీడియో)

సారాంశం

వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్  పార్టీ అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉదయసముద్రం ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. 

నల్గొండ: వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.  తెలంగాణలోని 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండే ఇటీవల షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. 

తాజాగా ys sharmila padayatra 21వ రోజుకు చేరుకుంది. మంగళవారం nalgonda district నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి షర్మిల పాదయాత్ర చేరకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళ హారతులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని తన తండ్రి ys rajashekar reddy గ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

వీడియో

ఈ సందర్భంగా షర్మిల ఉదయసముద్రం ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా  లక్షల ఎకరాలకు నీరు అందించి ప్రజల కష్టాలు తీర్చే ఈ udaya samudram project ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. 

read more  దున్నపోతు మీద వానపడినట్లే.. కేసీఆర్‌లో చలనం లేదు.. మాకు ఒక్క అవకాశమివ్వండి: వైఎస్ షర్మిల

ఇదిలావుంటే ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా నిర్ణయించి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులు తరపున షర్మిల పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆమె నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. భారీగా యువత, పార్టీ శ్రేణులు వెంటరాగా నిరుద్యోగ నిరాహార దీక్షాస్థలివైపు షర్మిల పాదయాత్ర సాగుతోంది. 

షర్మిల ప్రజాప్రస్థానం యాత్రను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్రలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాదయాత్ర మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతుండగా వైసపి నాయకులు, టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి షర్మిలను కలిసారు. దాదాపు గంటసేపు వారిద్దరి మధ్య మంతనాలు జరిగాయి. 

ఇక ఇదే మహేశ్వరంలో పాదయాత్ర కొనసాగుతుండగా ప్రముఖ టాలీవుడ్ యాంకర్ శ్యామల పాల్గొన్నారు.  శ్యామలతో పాటు ఆమె భర్త నరసింహ రెడ్డి కూడా వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ...  షర్మిలతో కలిసి నడవడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని Anchor Shyamala అన్నారు.   

read more YS Sharmila: 108కి ఫోన్ చేసిన వైఎస్ షర్మిల.. అంబులెన్స్ రాకపోవడంతో పాదయాత్రకు సంబంధించిన అంబులెన్స్‌లోనే..

ఇక పాదయాత్రలో రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజల  సమస్యలను తెలుసుకుంటున్నారు షర్మిల. మహిళలు, కూలీలు, నిరుపేద ప్రజలవద్దకు స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. 

షర్మిల పాదయాత్రకు ప్రజలనుండి కూడా ఆదరణ లభిస్తుంది. వైఎస్సార్ టిపి శ్రేణులతో, యువత, సామాన్య ప్రజానికం ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. జై వైఎస్సార్, జై షర్మిలక్క, జై వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ నినాదాల మధ్య షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇలా రంగారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర ముగియగా ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?