ఉద్యోగానికి గద్ధర్ దరఖాస్తు: ఏ సర్టిఫికెట్లు లేవు.. రాయడం, పాడటం, ఆడటమే అర్హతలట

Published : Dec 04, 2019, 05:24 PM ISTUpdated : Dec 04, 2019, 05:28 PM IST
ఉద్యోగానికి గద్ధర్ దరఖాస్తు: ఏ సర్టిఫికెట్లు లేవు.. రాయడం, పాడటం, ఆడటమే అర్హతలట

సారాంశం

ప్రజా గాయకుడు గద్దర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అదేంటి ఏడు పదుల వయసులో ఆయన జాబ్‌కి అప్లై చేయడం ఏంటని అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే

ప్రజా గాయకుడు గద్దర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అదేంటి ఏడు పదుల వయసులో ఆయన జాబ్‌కి అప్లై చేయడం ఏంటని అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడి ఉద్యోగానికి నోటిఫికేషన్ వెలువడింది.

ఈ క్రమంలో ఆయన నిర్ణీత నమూనాలో కాకుండా తన సొంత లెటర్‌ ప్యాడ్‌పై ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం స్వయంగా మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయానికి వెళ్లిన ఆయన అనుచరుడి ద్వారా ఉద్యోగ దరఖాస్తును నియామక కమిటీ కార్యదర్శి బి. శివకుమార్‌కు అందజేశారు.

Also Read:justice for disha:ఆ మెుగుడు నాకొద్దు, ఉరితియ్యండి: దిశ హత్య కేసు నిందితుడి భార్య

అలాగే దరఖాస్తు అందినట్లుగా మరొక ప్రతిపై సంతకం చేయాలని ఆయనను కోరారు. అయితే నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకున్నారా..? అని ఆరా తీసిన శివకుమార్.. అలా లేకపోవడంతో గద్దర్ దరఖాస్తు అందినట్లుగా దాని ప్రతిపై సంతకం చేయడానికి మాత్రం నిరాకరించారు. అదే సమయంలో ఈ విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు.

యాదగిరి ఈ విషయాన్ని గద్దర్‌కు చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రస్తుతం గద్దర్ వయసు 73 ఏళ్లు.. తానొక గాయపడ్డ ప్రజల పాటను, రాయడం- పాడటం- ఆడటం తన వృత్తి అని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఇంజనీరింగ్ చదివిన ఆయన ప్రస్తుతం తన వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని అందులో స్పష్టం చేశారు. కాబట్టి తనను కళాకారునిగా నియమించగలరని గద్ధర్ విజ్ఞప్తి చేశారు. 

Also read:justice for disha:ఆ మెుగుడు నాకొద్దు, ఉరితియ్యండి: దిశ హత్య కేసు నిందితుడి భార్య

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్