Justice For Disha: ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Dec 4, 2019, 3:05 PM IST
Highlights

దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం  తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపింది.

Also read:జస్టిస్ ఫర్ దిశ: ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు లేఖ

దిశ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు బుధవారం నాడు లేఖ పంపింది.ఈ లేఖకు హైకోర్టు సమాధానాన్ని ఇచ్చింది. దిశ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు బుధవారం నాడు లేఖ పంపింది.

ఈ లేఖకు హైకోర్టు సమాధానాన్ని ఇచ్చింది. వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశంలో సంచలనం రేపుతోంది.

జస్టిస్ ఫర్ దిశ: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన తృప్తి దేశాయ్ అరెస్ట్

ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కూడ భావిస్తోంది. ఈ తరుణంలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు లేఖ రాసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు.ఈ లేఖకు హైకోర్టుకు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్  కోర్టు ఏర్పాటుకు సానుకూలంగా హైకోర్టు లేఖ రాసింది.  ఈ లేఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖకు అందింది.

Also read:15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

ఈ విషయమై తెలంగాణ న్యాయ శాఖ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు విషయమై రంగం సిద్దం చేస్తోంది.  షాద్‌నగర్ కోర్టుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు హోదా కల్పిస్తారా లేదా మహబూబ్‌నగర్ జిల్లా కోర్టుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కల్పిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఏ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టు హోదా కల్పిస్తారో ఆ కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తారు.  

మరో వైపు ఈ కేసులో నిందితులను  కఠినంగా శిక్షించాలనే అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం కూడ ఉంది. ఇటీవల కాలంలోనే వరంగల్ లో రేప్ నిందితుడికి  కూడ ఆరు మాసాల్లోనే  శిక్ష పడింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసు విచారణ చేసి నిందితుడికి శిక్షను విధించింది.కానీ, దిశ కేసు దృష్ట్యా మరింత త్వరగానే ఈ కేసును విచారణ చేసి నిందితులను శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 

click me!