
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఆయన హీరోగా నటించిన యోగి సినిమా సుదర్శన్ థియేటర్‌లో రీ రిలీజ్ అయ్యింది. ఈ సమయంలో వివాదం చోటు చేసుకోవడంతో స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు అభిమానులు. థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో ఫ్యాన్స్ దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పలువురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.