
హైదరాబాద్: విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో హైద్రాబాద్ Uppal stadiumకి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు Tssspdcl అధికారులు. అయితే విద్యుత్ బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. రూ. 3 కోట్ల రూపాయాల విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టుగా విద్యుత్ శాఖాధికారుల తెలిపారు. అయితే విద్యుత్ బకాయిలు చెల్లించకుండా అక్రమంగా విద్యుత్ ను ఉపయోగిస్తున్నారని ఉప్పల్ స్టేడియం యాజమాన్యంపై కేసు నమోదు చేశామని విద్యుత్ శాఖాధికారులు తెలిపారు.
విద్యుత్ బిల్లులు చెల్లించడంలో హెచ్‌సీఏ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని విద్యుత్ శాఖాధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై హెచ్‌సీఏ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే తీర్పు విద్యుత్తు శాఖకు అనుకూలంగా రావడంతో హెచ్‌సీఏకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ బకాయిలపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేసినట్లు అధికారులు పేర్కొన్నారు.