మారుతీ రావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి.. : నివేదికలో ఏముంది

By Siva KodatiFirst Published Mar 8, 2020, 4:56 PM IST
Highlights

చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య మహాసభ భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు మృతదేహాన్ని సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి భార్య గిరిజకు అప్పగించారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కీలక నిందితుడు మారుతీ రావు ఆదివారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య మహాసభ భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు మృతదేహాన్ని సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి భార్య గిరిజకు అప్పగించారు. అనంతరం మారుతీరావు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు తరలించారు.

Also Read:మారుతీరావు సూసైడ్: గారెలు తిన్నాడు, విషం బాటిల్ ఎక్కడ?

అయితే అంత్యక్రియలు ఇవాళే జరుగుతాయా లేక సోమవారం జరుగుతాయా అన్న విషయం తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏం తేలిందనే విషయం కూడా బయటికి రాలేదు.

అయితే సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మారుతీరావు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్థారించామని చెప్పారు. ఘటన తర్వాత ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్ టీమ్ సాయంతో తనిఖీలు చేయించామని సీఐ తెలిపారు.

Also Read:వీలునామా రద్దు, ఆస్తి వివాదాలు లేవు కానీ..: మారుతీరావు సోదరుడు శ్రవణ్ కుమార్

ఘటనాస్థలిలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రణయ్ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బనాయించిన కేసుల ఒత్తిడి కారణంగా మనస్తాపానికి గురై మారుతీరావు బలవన్మరణానికి పాల్పడి వుంటారని తాము భావిస్తున్నట్లు సైదిరెడ్డి తెలిపారు. 

click me!