మారుతీరావు సూసైడ్: గారెలు తిన్నాడు, విషం బాటిల్ ఎక్కడ?

By narsimha lodeFirst Published Mar 8, 2020, 4:39 PM IST
Highlights

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మారుతీరావు విషం తీసుకొన్న తర్వాత వాంతులు చేసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 


హైదరాబాద్: ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మారుతీరావు విషం తీసుకొన్న తర్వాత వాంతులు చేసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే మారుతీరావు ఆత్మహత్యకు ఉపయోగించిన బాటిల్ మాత్రం సంఘలన స్థలంలో లభ్యం కాలేదు.  

Also read:వీలునామా రద్దు, ఆస్తి వివాదాలు లేవు కానీ..: మారుతీరావు సోదరుడు శ్రవణ్ కుమార్

ఈ నెల 7వ తేదీ సాయంత్రం 6:40 గంటలకు హైద్రాబాద్‌ ఆర్యవైశ్య భవనానికి  చేరుకొన్నాడు.  ఆర్యవైశ్య భవన్ వద్ద 306 రూమ్ ను అద్దెకు తీసుకొన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి మారుతీరావు బయటకు వెళ్లి వచ్చాడు. అరగంటలోనే మారుతీరావు తిరిగి తన గదికి వచ్చాడు. కొద్ది సేపటి తర్వాత డ్రైవర్ మారుతీరావు నుండి వెళ్లిపోయాడు.  మారుతీరావు  మాత్రం గదిలోనే ఉన్నాడు.

హైద్రాబాద్‌లో ఓ న్యాయవాదిని కలుసుకొనేందుకు  మారుతీరావు వచ్చాడు. శనివారం నాడు సాయంత్రం ఆయనను కలుసుకొనేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. ఆదివారం నాడు ఉదయం లాయర్ ను కలిసేందుకు మారుతీరావు ప్లాన్ చేసుకొన్నాడు.  

ఆదివారం నాడు ఉదయం 8 గంటలకే  తనను నిద్ర లేపాలని డ్రైవర్ కు మారుతీరావు చెప్పాడు. డ్రైవర్ ను కారులోనే పడుకోవాలని చెప్పాడు. ఆదివారం నాడు ఉదయం మారుతీరావును నిద్ర లేపేందుకు డ్రైవర్ నిద్ర లేచాడు. కానీ మారుతీరావు తలుపులు తీయలేదు.

ఆర్యవైశ్య భవన్ సిబ్బందితో కలిసి డ్రైవర్  మారుతీరావు బస చేనిన తలుపులు బద్దలు కొట్టారు. అయితే అప్పటికే అతను మరణించి ఉన్నాడు. మారుతీరావు శనివారం నాడు సాయంత్రం  గారెలు తిన్నాడు.  మారుతీరావు విషం తీసుకొన్న తర్వాత  వాంతులు చేసుకొన్నాడు.కానీ మారుతీరావు విషం బాటిల్ మాత్రం లభ్యం కాలేదు. ఈ బాటిల్ ను ఎక్కడ వేశాడనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మారుతీరావు ఉపయోగించిన గది చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారాలను కూడ పోలీసులు సేకరించారు.  మరోవైపు మారుతీరావు ఉపయోగించిన గదిలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తైంది. డెడ్ బాడీని మిర్యాలగూడకు తరలించారు. 

click me!