దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్ ను చేయాలని విద్యాసాగర్ రావు ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
హైదరాబాద్: దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్ ను చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? బీజేపీ పార్టీకి సంబంధించినవా అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రవ్నంచారు.
దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్ ను ఏర్పాటు చేయాలని ఇవాళ విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.దేశానికి హైద్రాబాద్ ను రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ ఆనాడే చెప్పిన విషయాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు.
undefined
హైద్రాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యాసాగర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నికల స్టంట్ గా కన్పిస్తున్నాయన్నారు.
సుదీర్ఘకాలం పాటు బీజేపీలో పనిచేసిన విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రిగా కూడ పనిచేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్రకు గవర్నర్ గా విద్యాసాగర్ రావు పనిచేశారు.
also read:దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అవుతుంది.. అంబేద్కర్ ఆలోచనా ఇదే : విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర గవర్నర్ గా పదవీకాలం పూర్తైన తర్వాత తెలంగాణకు ఆయన తిరిగి వచ్చారు. హైద్రాబాద్ ను దేశానికి రెండో రాజధానిని చేయాలని విద్యాసాగర్ రావు గతంలో కూడ డిమాండ్ చేశారు.