వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం..

Published : Jun 16, 2023, 04:21 PM IST
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం..

సారాంశం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాలు.. పరిగి పరిధిలోని శ్రీవెంకటేశ్వర బాయిలర్ సమీపం నుంచి ప్రయాణికులు ఆటోలో వెళ్తున్నారు. వారి ఆటో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఎనిమిది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

అయితే గాయపడినవారిలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఐదుగురు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్