కారు జోరు ఇవాళ ఉండొచ్చు.. రేపు రిపేర్ కి రావొచ్చు.. పొన్నం

Published : Dec 15, 2018, 02:11 PM ISTUpdated : Dec 15, 2018, 03:29 PM IST
కారు జోరు ఇవాళ ఉండొచ్చు.. రేపు రిపేర్ కి రావొచ్చు.. పొన్నం

సారాంశం

తెలంగాణ లో ఈరోజు కారు జోరులో ఉండొచ్చని.. కానీ రేపు అదే కారుకి రిపేరు రావొచ్చని తెలంగాణ కాంగ్రెస్ నేత , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ లో ఈరోజు కారు జోరులో ఉండొచ్చని.. కానీ రేపు అదే కారుకి రిపేరు రావొచ్చని తెలంగాణ కాంగ్రెస్ నేత , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్  అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అతి తక్కువ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.కాగా.. ఈ విషయంపై తాజాగా మీడియాతో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో క్యాడర్ అధైర్యపడొద్దని సూచించారు. ఎన్నికల్లో గెలుపు ఓటమిలు

సహజమన్నారు. మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.  కోరు జోరు ఇవాళ ఉండొచ్చని.. రేపు రిపేర్ కావచ్చని పేర్కొన్నారు. 

టీఆర్ఎస్ కి బీజేపీ తోకపార్టీ అని విమర్శించారు. 105మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదని.. ఇక బీజేపీ కార్యాలయానికి తాళాలు వేసుకోవాలని సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే
IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు