మావల్లే: లగడపాటిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Dec 15, 2018, 2:05 PM IST
Highlights

ఎన్నికలకు ముందు లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి ప్రయత్నించాడని కేటీఆర్ చేశారు. అయితే ఆ సర్వేకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు నిచ్చారని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఓటర్లను కన్ప్యూజ్ చేయడానికే ఈ ప్రయత్నం జరిగిందన్నారు. గతంలో తమ వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి ఇప్పుడు సర్వే సన్యాసం కూడా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రజల్లో కాస్తో కూస్తో వున్న క్రెడిబిలిటి కూడా ఈ సర్వేతో పోయిందని కేటీఆర్ విమర్శించారు.  

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరస్మరణీయ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్నికలకు సహకరించిన మీడియాకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తాను జీవితాంతం గుర్తుంచుకునే విధంగా విజయం అందించారని కొనియాడారు. హైదరాబాద్ సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో విజయం సాధించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్ని ఓ వైపు నిలిస్తే వారిని కేసీఆర్ ఒక్కరే ఓ వైపు ఉండి ఘన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు, కేసీఆర్ కు మధ్య వుండే పేగు బంధం బయటపడిందని పేర్కొన్నారు. 

స్వీయ రాజకీయ అస్థిత్వం వుండాలని జయశంకర్ ఎప్పుడూ చెప్పేవారని...ఆ దిశగానే తాము ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనేలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఇప్పిటికే బలంగా వున్న పార్టీని బూత్ స్థాయి నుండి మరింత బలోపేతంగా తయారుచేయడానికి పనిచేస్తానని కేటీఆర్ వెల్లడించారు. 

తెలంగాణలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొంటే అందులో 98 లక్షల ఓటర్లు టీఆఱ్ఎస్ కు ఓటేశారు. దాదాపు 47 శాతం ఓట్లు తమ పార్టీకి వచ్చాయని గుర్తు చేశారు. తమ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కు, తమకు 42 లక్షల ఓట్ల అంతరం   29 శాతం ఓట్ల అంతరం ఉందన్నారు. ఇక మరో జాతీయ పార్టీ బిజెపి 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అంతేం కాదు: చంద్రబాబుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

click me!