కేసీఆర్ నా దేవుడంటూ.. కాళ్లమీద పడ్డ ఎమ్మెల్యే

Published : Dec 15, 2018, 01:53 PM IST
కేసీఆర్ నా దేవుడంటూ.. కాళ్లమీద పడ్డ ఎమ్మెల్యే

సారాంశం

ఒక లారీ డ్రైవర్ కొడుకైన తనకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన కేసీఆర్ తనకు దేవుడితో సమానమన్నారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.


ఒక లారీ డ్రైవర్ కొడుకైన తనకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన కేసీఆర్ తనకు దేవుడితో సమానమన్నారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ నరేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను నరేందర్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు.. కేసీఆర్ కి పాదాభివందనం చేసి మరీ అభినందనలు తెలిపారు. అనంతరం.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కి నన్నపునేని నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు. 

పార్టీని మరింత బలోపేతం చేయడానికి కేటీఆర్ కృషి చేస్తారన్నారు. కేటీఆర్ న్యాయకత్వంలో పార్టీ ప్రజలకు మరింత చేరువ అవుతుందని అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం